Wednesday, May 1, 2024

ఈనెల 25న ‘ఆహా’లో డబుల్ ధమాకా

ఈనెల 25న శుక్రవారం సినిమా ప్రియులకు పసందైన విందు ఇవ్వబోతోంది. ఎందుకంటే ఆ ఒక్కరోజే రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ నెల 25న ఈ రెండు చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ‘ఎల్‌.కె.జి’, ‘జీవి’ ఈ రెండు చిత్రాలు ఓటీటీ వేదికగా డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాయి.

చిన్న పట్టణంలో రాష్ట్రానికి సీఎం కావాలని కలలు కంటున్న కౌన్సిలర్‌ కథ ఆధారంగా ‘ఎల్‌.కె.జి’ని తెరకెక్కించారు. ‘అమ్మోరు తల్లి’ సినిమాతో అలరించిన ఆర్‌.జె.బాలాజీ కీలకపాత్ర పోషించారు. మరో వైపు.. బంగారం చోరీ చేసి జీవితంలో సెటిల్‌ అయిపోవాలనే ఒక తెలివైన యువకుడి కథ ఆధారంగా తెరకెక్కించిన ‘జీవి’ సైతం విడుదల కానుంది. వి.జె.గోపీనాథ్‌ దర్శకత్వం వహించారు. వెట్రి, మోనిక చిన్నకొట్ల కీలకపాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement