Saturday, April 20, 2024

కార్తీకేయ సినిమా పేరు ‘రాజా విక్రమార్క’

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీకేయ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన సినిమా టైటిల్ ఖరారైంది. శ్రీ సారిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి ‘రాజా విక్రమార్క’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం సినిమా టైటిల్‌ పోస్టర్‌ను దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా విడుదల చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. అనంతరం కార్తికేయ సైతం పోస్టర్‌ని షేర్‌ చేస్తూ.. బిగ్‌బాస్‌ చిరంజీవి సినిమా టైటిల్‌ను తన సినిమాకు వాడుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు.

‘చావు కబురు చల్లగా’ తర్వాత కార్తీకేయ నటిస్తున్న చిత్రమిదే. పోస్టర్‌ను చూస్తుంటే ఈ చిత్రంలో కార్తీకేయ… క్లాస్‌, మాస్‌ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శ్రీ చిత్ర మూవీ మేకర్స్‌ పతాకంపై రమారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌.విహారి స్వరాలు అందించనున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement