Thursday, April 25, 2024

జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. టీవీ నటుడు సిద్దాంత్‌ వీర్‌ మృతి

ప్రముఖ టీవీ నటుడు సిద్దాంత్‌ వీర్‌(46) జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి చెందినట్టుగా ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. క్కుసుమ్‌, వారిస్‌, సూర్యపుత్ర కర్ణ్‌ వంటి షోల ద్వారా సిద్దాంత్‌ వీర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనంద్‌గా పేరొందిన నటుడు ఇటీవల తన పేరును సిద్ధాంత్‌ వీర్‌ సూర్యవంశీగా మార్చుకున్నారు. సిద్ధాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సిద్ధాంత్‌ మరణం పట్ల జే భానుశాలి, సలీల్‌ అంకోల సహా పలువురు టీవీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య అలెసియా రౌత్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement