Saturday, April 20, 2024

ISRO: స్పేస్​లోకి వెళ్లేందుకు విక్రమ్​–S రెడీ.. దేశంలో తొలి ప్రైవేట్​ రాకెట్​ ప్రయోగం ఇదే!

దేశంలో ప్రైవేట్‌ సంస్థ డెవలప్​ చేసిన మొట్టమొదటి రాకెట్ — విక్రమ్-S  త్వరలోనే నింగిలోకి ఎగరనుంది.- ఇది మూడు పేలోడ్‌లతో ఉప-కక్ష్యలోకి వెళ్లేందుకు నవంబర్ 15న ప్రయోగానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ విషయాన్ని ప్రకటించింది. స్కైరూట్ ఏరోస్పేస్ కి చెందిన తొలి మిషన్, ‘ప్రారంభ్’ (ప్రారంభం) పేరుతో ఇద్దరు భారతీయ, ఒక విదేశీ కస్టమర్ల పేలోడ్‌లను విక్రమ్​ ఎస్​ తీసుకువెళుతుంది. శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన లాంచ్‌ప్యాడ్ నుండి ఇది ప్రయోగానికి సిద్ధంగా ఉంది.

ఈ ఉపగ్రహ ప్రయోగం 15వ తేదీన ఉదయం11:30 గంటలకు ఉంటుందని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ,సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు. చెన్నైకి చెందిన స్పేస్‌కిడ్జ్, ఏరోస్పేస్ స్టార్టప్, విక్రమ్-ఎస్‌లోని సబ్-ఆర్బిటల్ ఫ్లైట్‌లో భారతదేశం, యుఎస్, సింగపూర్,  ఇండోనేషియా నుండి విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ ‘ఫన్-సాట్’ను ఎగురవేయనున్నారు.

2020లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఈజీ చేయడానికి 2020లో ఈ ఒప్పందం చేసుకున్నారు. అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ కంపెనీగా స్కైరూట్ అవతరించింది. భారతీయ అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్‌కు నివాళిగా స్కైరూట్ యొక్క ప్రయోగ వాహనాలకు ‘విక్రమ్’ అని పేరు పెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న స్కైరూట్ తన రాకెట్లను ప్రయోగించడానికి ఇస్రోతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన మొదటి స్టార్టప్.

- Advertisement -

2018లో స్థాపించిన స్కైరూట్ అధునాతన మిశ్రమ,3D-ప్రింటింగ్ టెక్నాలజీలను ఉపయోగించి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్, హైపర్‌గోలిక్-లిక్విడ్.. ఘన ఇంధనం ఆధారిత రాకెట్ ఇంజిన్‌లను విజయవంతంగా నిర్మించి పరీక్షించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement