Thursday, March 28, 2024

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు.. మేం చేసేదే చెప్తాం అన్ని కేజ్రీవాల్‌

ఢిల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, ‘ఆప్‌’ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలకు కీలక హామీలిచ్చారు. పౌర సంస్ధల్లో అవినీతిని నిరోధించడం, చెత్త డంపింగ్‌ యార్డుల తరలింపు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదల వంటి పలు హామీలిచ్చారు. తామేం చెప్పామో అదే చేస్తామని కేజ్రీవాల్‌ చెబుతూ ఇతరులు వచన్‌ పత్ర విడుదల చేశారని, వచ్చే ఏడాది వారు దాన్ని సంకల్ప్‌ పత్రం అంటారని, ఎన్నికల తర్వాత హామీలు, మేనిఫెస్టోను బుట్టదాఖలా చేస్తారని కాషాయ పార్టీని ఉద్దేశించి కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు.

తాము అధికారంలోకి వస్తే ఢిల్లిలో పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం, రోడ్లకు రిపేర్లు సహా 10 హామీలను ప్రకటించారు. తాము ఏం వాగ్దానమిచ్చామో.. అదే చేస్తామని కేజ్రీవాల్‌ పునరుద్ఘాటించారు. ఎంసీడీలోని 250 వార్డులకు డిసెంబర్‌ 4న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 7న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బిజెపి, ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీగా నెలకొననున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement