Thursday, April 25, 2024

‘పవన్ సినిమా కోసం’ బ్రహ్మాజీకి ప్రత్యేక పాత్ర రాసిన త్రివిక్రమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు సాగర్ కే.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మామూలుగా త్రివిక్రమ్ ప్రతి సినిమాలో కూడా బ్రహ్మాజీ కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు ఈ రీమేక్ కోసం కూడా బ్రహ్మాజీ కి కీలకమైన పాత్రను ఇచ్చారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో రానా కారు డ్రైవర్ గా బ్రహ్మాజీ కనిపించబోతున్నాడట. ఇక ఆయన స్క్రీన్ పై కనిపించే టైం చాలా తక్కువ అయినా.. కూడా చాలా కీలకమైన పాత్రట. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. వీటితోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement