Thursday, April 25, 2024

45 ఏళ్ల పైబ‌డిన వాళ్ల‌కే వ్యాక్సిన్…..

ఆన్‌లైన్‌లో బుక చేసుకుంటేనే
నేరుగా వెళితే టీకా దొరకదు

హైదరాబాద్‌, : రాష్ట్రంలో 45ఏళ్లు దాటిన వారికి మాత్రమే కరోనా టీకా అందనుంది. మే 1 నుంచి 18ఏళ్లు నిండిన వారందరికీ కరోనా టీకా వేస్తామని కేంద్రం ప్రకటించినా… వ్యాక్సిన్లకు కొరత కారణంగా ఆ ప్రకటన కార్యరూపం దాల్చడం లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మరో 5695 మందికి కరోనా మహమ్మారి సోకింది. కరోనాతో ఒక్క రోజే 46 మంది మృత్యువాతపడ్డారు. అయితే రోజు వారీ కరోనా టెస్టులు లక్షా 20వేల నుంచి 50వేలకు తగ్గడంతోనే పాజిటివ్‌ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్‌ కేసులు త్గుతున్నప్పటికీ ఆసుపత్రులకు కోవిడ్‌ రోగులు పోటె త్తుతూనే ఉన్నారు. దీంతో ఆసుపత్రుల్లో సదుపా యాల కొరత ఏర్పడుతోంది. కోవిడ్‌ బెడ్‌ కోసం రోజుల తరబడి రోగులు, వారం బంధువులు ఆసుపత్రుల ప్రాంగణాల్లోని చెట్ల కిందే నిరీక్షించాల్సిన దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. 45ఏళ్లు పైబడిన వారు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే టీకా వేస్తా మని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారికి టీకాలు వేయ టం లేదని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లోనే కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు వివరించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మందికి టీకాలు వేయనున్నట్లు తెలిపారు. మిగతా చోట్ల ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్‌ ఇస్తామన్నారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో మొదటి, రెండోడోస్‌ వేస్తామన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకునే తేదీ, దగ్గర్లోని ఆరోగ్య కేంద్రం వివరాలు నమోదు చేయాలన్నారు. నేరుగా వ్యాక్సిన్‌ సెంటర్లకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా వ్యాక్సినేషన్‌ పొందే అవకాశం ఉండదన్నారు. మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత 6 వారాలు పూర్తౖనా… రెండో డోస్‌ తీసుకోవచ్చన్నారు. కోవిషీల్డ్‌ మొదటి డోస్‌ తీసుకున్న ఆరు నుంచి 8 వారాల తర్వాత కూడా రెండో డోస్‌ తీసుకోవచ్చని తెలిపారు. కోవాగ్జిన్‌ మొదటి డోస్‌ తీసుకుంటే 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోస్‌ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో డోస్‌కు నాలుగైదు రోజులు అటు ఇటు అయినా ఫరవాలేదన్నారు. అయితే రెండు డోస్‌ల కరోనా టీకా తీసుకుంటేనే వైరస్‌ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement