Sunday, May 9, 2021

తెలంగాణలో ఆత్మ గౌరవ ఉద్యమం: ఈటల

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది. ఇది ఆత్మ గౌరవ ఉద్యమమని… తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? అనే అంశంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి మద్దతుగా తెలంగాణ ఎన్ఆర్ఐ అమెరికా ఫోరం ఆధ్వర్యంలో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురు ఎన్ఆర్ఐలతో ఈటల మాట్లాడారు. పూర్తిగా తప్పుడు ఆరోపణలతో తనను బయటికి పంపిచారని ఆయన అన్నారు. సిట్టింగ్ జడ్జితో తన మొత్తం వ్యాపారం మీద.. సంపాదించిన ఆస్తుల మీద విచారణ చేయించాలని సీఎం కేసీఆర్‌ని కోరినట్టు ఈటల చెప్పారు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడనన్నారు. ప్రజలను నమ్ముకున్నానని… ప్రలోభాలకు లొంగ లేదు కాబట్టే ఈ నిందలు వేస్తున్నారని ఈటల పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు తనకు మద్దతు తెలిపినందుకు ఈటల ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News