Wednesday, May 1, 2024

థమన్ తో త్రివిక్రమ్ సిటింగ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర రాజకీయాలకు ముడిపడి ఉండనుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అందులో ఒకరిగా కియారా అద్వాని ని సెలెక్ట్ చేసారట. అయితే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సంగీత చర్చలు త్వరలో ప్రారంభం కానున్నాయట. సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తో త్రివిక్రమ్ సిటింగ్ వేయనున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement