Tuesday, April 30, 2024

యూటర్న్ డైరెక్టర్ తో త్రిష కొత్త సినిమా ?

స్టార్ హీరోయిన్ త్రిష గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. దశాబ్దకాలానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమాలను చేస్తోంది. ఇప్పుడు కూడా అదే జోష్ ని కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్రిష. కన్నడ రాక్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ యూటర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ తో ద్విత్వా అనే సైకలాజికల్ థ్రిల్లర్ లను చేయబోతున్నట్టు జూలై 3న ప్రకటించారు.

ఈ సినిమాను హోమ్ భలే ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిండేది ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ నడిచింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కబోతుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement