Friday, May 3, 2024

Trailer – ఆశ‌లు ఆకాశంలో ‘ఉస్తాద్’ …ల‌వ్ కాన్సెప్ట్ తో ట్రైల‌ర్

YouTube video

శ్రీసింహా హీరోగా రూపొందిన మూవీ ఉస్తాద్ . వారాహి చలనచిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి ఫణిదీప్ ద‌ర్శ‌కుడు. శ్రీ సింహా జోడీగా కావ్య కల్యాణ్ రామ్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
కాస్త ఎత్తుపై నుంచి చూస్తే కళ్లు తిరిగే ఒక యువకుడు, ఆకాశంలో నుంచి నేలను చూడాలనుకుంటాడు. పాత బైక్ రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు లేని ఆ కుర్రాడు, ఏకంగా విమానం పైలెట్ కావాలనుకుంటాడు. పరిస్థితులు వెనక్కి లాగినా, ప్రేమించిన అమ్మాయి ప్రోత్సాహంతో తాను అనుకున్నది ఎలా సాధించాడు? అనేదే కథ. ఇదే విషయాన్ని ట్రైలర్ ద్వారా అర్థమయ్యేలా చేశారు. . ఆగస్టు 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement