Sunday, April 28, 2024

Tamil hero Captain: సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం …త‌మిళ హీరో కెప్టెన్ విజ‌య్ కాంత్ క‌న్నుమూత

భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు, దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ సినిమా షూటింగ్స్‌ను నిలిపి వేసి సంతాపం ప్ర‌క‌టించింది.. అలాగే నేడు థియేటర్లలోని షోల‌ను ర‌ద్దు చేసింది.. కాగా, 1952 ఆగష్టు 25న మధురై నగరంలో విజయ్‌కాంత్ జన్మించిన విజయ్‌కాంత్.. ‘ఇనిక్కుం ఇలామై’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. సుమారు వందకుపైగా చిత్రాల్లో హీరోగా నటించారు. అంతేకాదు.. దాదాపు 20కి పైగా చిత్రాల్లో పోలీసు పాత్రలో నటించి మెప్పించారు. తన 100 చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం తర్వాత ఆయన్ను అభిమానులు కెప్టెన్‌గా పిలవడం ప్రారంభించారు. అనంతరం 2005, సెప్టెబర్ 14న డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయ్‌కాంత్ తొలిసారి గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement