Sunday, April 28, 2024

తమిళ్ సూపర్ స్టార్ల కోసం.. ట్రై చేస్తున్నటాలీవుడ్ యంగ్ డైరెక్టర్లు

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మలినేని ఇటీవల సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన తమ తమ సినిమాలతో విజయాన్ని రుచి చూశారు. ఇక, తాజాగా ఈ ఇద్దరు దర్శకులు తమిళ చిత్ర పరిశ్రమలోని సూపర్ స్టార్లు అయిన రజినీకాంత్, విజయ్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. కాగా, ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన ప్రాథమిక సమావేశాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు డైరెక్టర్లు మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసి తమ కథనంతో హీరోలను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

యాక్షన్, కామెడీ మిక్స్ చేసి తీసే మాస్ ఎంటర్టైనర్లకు బాబీ పెట్టింది పేరు. మెగాస్టార్ చిరంజీవిని వినోదాత్మకంగా చూపించడంలో ఆయన ఎంత సక్సెస్ అయ్యారో వాల్తేరు వీరయ్యతో అందరికీ తెలిసిందే. ఇక అచ్చం అలానే తన వింటేజ్ గ్లింప్స్ చూపించి సూపర్ స్టార్ అభిమానులను, ఇతర తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోగలరు కాబట్టి ఆయన శైలి రజినీకాంత్ కు సరిపోతుంది అనే చెప్పవచ్చు.

అదే విధంగా గోపీచంద్ మలినేని, విజయ్ కాంబినేషన్ కూడా ఆసక్తికరమైనదే. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తీయడంలో గోపీచంద్ దిట్ట అనే పేరుంది. అయితే ఈ సినిమాల గురించి థలపతికి కథ వినిపించగా.. ఆయనుకు ఈ మాస్ యాక్షన్ స్టోరీ తెగ నచ్చేయడంతో సింగిల్ సిటింగ్ లోనే గోపీచంద్ కి ఓకే చెప్పేశాడని సినీ వర్గాల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement