Saturday, October 12, 2024

TS | తీన్మార్​ మల్లన్న కొత్త పార్టీ ప్రకటన.. మేడ్చల్​ నుంచి అసెంబ్లీ బరిలోకి

సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో జైలుకెళ్లిన తీన్మార్ మల్లన్న ఇవ్వాల (మంగ‌ళ‌వారం) జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో అత‌ని అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చర్లపల్లి జైలు వద్దకు చేరుకుని హంగామా చేశారు. ‘సీఎం కేసీఆర్ డౌన్ డౌన్’ అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన మల్లన్న.. తాను కొత్త పార్టీ పెడుతున్నట్టు కీలక ప్రకటన చేశారు.

తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు తీన్మార్ మల్లన్న. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయనున్నట్టు స్పష్టంచేశారు. మంత్రి మల్లా రెడ్డి సొంత నియోజకవర్గమైన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement