Friday, December 6, 2024

AP | చిత్తూరు జిల్లాలో యాక్సిడెంట్.. క‌ర్నాట‌క ఆర్టీసీ బ‌స్సు ఢీకొని వ్యక్తి మృతి

వాల్మీకిపురం (ప్రభ న్యూస్) : చిత్తూరు జిల్లాలో యాక్సిడెంట్ జ‌రిగింది. పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని మదనపల్లి నుండి తిరుపతికి వెళ్తున్న క‌ర్నాట‌క‌ వాహనం ఢీకొని ఒక‌రు అక్కడికక్కడే చ‌నిపోయారు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) రాత్రి వాల్మీకిపురం శివారు ప్రాంతంలోని పింగాణి ఫ్యాక్టరీ వ‌ద్ద జ‌రిగింది. ఫతేపురం గ్రామానికి చెందిన తుమ్మల ఆదినారాయణ (49 ), మదనపల్లిలో ప్రైవేటు లాడ్జిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తికి చెందిన త్రిచక్ర వాహనంలో మదనపల్లి నుండి వాల్మీకి పురానికి బయలుదేరి వచ్చాడు.

దారిలో పింగానీఫ్యాక్టరీ సమీపంలో దిగి కాలినడకన నిమ్మలపల్లి బస్టాండ్ కు వెళ్తుండ‌గా మదనపల్లి నుండి తిరుపతికి వెళుతున్న క‌ర్నాట‌క‌ ఆర్టీసీ బస్సు వెనుకవైపు నుండి వచ్చి ఆదినారాయణ పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బాధితుని శరీరము నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆప‌కుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు చాకచక్యముతో వ్యవహరించి బస్సును కలికిరి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఐ లీలావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement