Monday, April 29, 2024

‘అహం బ్రహ్మాస్మి’ లో టాలీవుడ్ స్టార్ హీరో ?

ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్. ప్రస్తుతం మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అహం బ్రహ్మాస్మి. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్ పతాకంపై మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో స్టార్ హీరో కనిపించబోతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగార్జునని… క్లైమాక్స్ సీన్ లో నాగ్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్ ఈ సినిమాతో ఎంతవరకు విజయం సాధించగలడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement