Tuesday, April 30, 2024

నా ప్రేమ‌ని చెప్ప‌డానికి టైం రావాలి.. విజ‌య్ వ‌ర్మ‌

నా ప్రేమ గురించి చెప్ప‌డానికి టైం రావాల‌ని అన్నారు న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌. వ్యక్తిగత జీవితం గురించి అభిమానులు తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉన్నారని ఆయ‌న్ని యాంక‌ర్ అడ‌గ్గా.. తాను ప్రేమలో ఉన్నట్టు పరోక్షంగా అంగీకరించారు. సరైన సమయం వచ్చినప్పుడు మీరు దాని గురించి మాట్లాడండి. నా జీవితం ఇప్పుడు ఎంతో ప్రేమతో నిండింది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాననే చెప్పగలను అని విజయ్ వర్మ స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం కంటే తాను చేసే పనులే మాట్లాడాలని అనుకుంటున్నట్టు తెలిపారు.కాగా విజయ్ వర్మ, తన మధ్య ప్రేమ ఉన్న విషయం నిజమేనని రీసెంట్ గా హీరోయిన్ తమన్నా అంగీకరించింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో వీరు తొలిసారి కలసి నటించగా, ఆ సమయంలోనే ప్రేమ చిగురించినట్టు చెప్పింది. సహ నటుడు అని కాకుండా తమ మధ్య స్వచ్ఛమైన అనుబంధం ఏర్పడినట్టు వివరించింది. తన మనసుకు దగ్గరయ్యాడని, తనకు అండగా నిలబడతానే నమ్మకం ఏర్పడినట్టు వివరించింది. అతడు ఉన్న చోట తనకు సంతోషం ఉంటుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement