Friday, March 1, 2024

Accident : శ్రీరాంపూర్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. తండ్రి, కొడుకు మృతి..

శ్రీరాంపూర్, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు పరిధిలో ఘోర రోడ్డు ప్రమాద చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై దంపతులు వారి కుమారుడు మందమర్రి వైపు వెళ్తుండగా మంచిర్యాల నుండి చెన్నూరు వైపు సిమెంట్ లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో రమేష్ (42), కుమారుడు(14) అక్కడికక్కడే మృతి చెందారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రమేష్ భార్య వెన్నెల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. వేగ నియంత్రణ సూచికలు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement