Wednesday, December 11, 2024

ఆదిపురుష్ కి ఆల్ ది బెస్ట్.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్

ట్విట్ట‌ర్ ట్రెండింగ్ లో ఉంది ఆది పురుష్ చిత్రం. ఈచిత్రంలో స్టార్ హీరో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుండ‌గా.. సీత‌గా హీరోయిన్ కృతిస‌న‌న్ న‌టిస్తుంది. కాగా ఆదిపురుష్ చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మర్యాద పురుషోత్తముడు ప్రభు శ్రీరామ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షింస్తున్నా. దర్శక నిర్మాతలకు, ఇతర చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఓంరౌత్ దర్శకుడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది.ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రేమికులే కాదు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు, ప్రముఖులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement