Monday, October 7, 2024

Accident: కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య..

కుమ్రo భీం ఆసిఫాబాద్, (ప్రభ న్యూస్) : వాంకిడి మండలం జైత్ పుర్ క్రషర్ సమీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. టిప్పర్, స్కూటీ ఢీకొని సామెల గ్రామానికి చెందిన తులసీరాం అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు మరణ వార్త విన్న తండ్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన తులసీ రాం కుటుంబానికీ ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తూ బైఠాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement