Sunday, May 5, 2024

దసరాకు అల‌రించ‌నున్న‌ మూడు పెద్ద సినిమాలు.. పోటీ గట్టిగానే ఉండేట్టుంది!

ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. అయితే ఇప్పుడు వేసవి కాలం ముగించుకొని వర్షాకాలంలోకి ప్రవేశించాం. సీజన్ ఏదైనప్పటికీ సినిమా పరిశ్రమ నుంచి వినోదానికి కొదవ లేదు. అనేక విభిన్న క‌థ‌నాల‌తో అద్భుతమైన అనుభవాలను అందించేలా కొత్త కొత్త మూవీస్ వ‌స్తున్నాయి.. అయితే.. ఈ సారి ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు రాడానికి మూడు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి.

దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న టాలీవుడ్ సినిమాలు ఏంటో చూస్తే.. మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఒకటి.. సెప్టెంబర్ 30న విడుదల కానున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీలో సత్యదేవ్, నయనతార ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో బాలయ్య చేయబోయే సినిమా. NBK107. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్ 5న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాణ బాధ్య‌తలు వ‌హిస్తోంది.

ఇక మూడో సినిమా మరెవరిదో కాదు అక్కినేని అఖిల్ చేస్తున్న‌ ఏజెంట్. ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా భారీ బ‌డ్జెట్తో రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. కానీ, దసరాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తార‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement