Sunday, April 28, 2024

సమంత ‘‘శాకుంతలం’’ రన్ టైమ్ ఇదే ! మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ లో తొలిసారి పౌరాణిక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శాకుంతలం మూవీ చేసింది. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో రూపోందిని ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా.. ఈ నెల (ఏప్రిల్) 14న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇక, ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అన్ని ఆప్‌డేట్స్ భారీ అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చింది.

ఈ మూవీకి సెన్సార్‌ బోర్డు క్లీన్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఈ శాకుంతలం రన్‌ టైం 142 నిమిషాలు ( 2 గంటల 22 నిమిషాలు) అని తెలిసింది. శాకుంతలం టీజర్‌, ట్రైలర్‌తోపాటు పాటలకు భారీ స్పందన రావడం ప్రేక్షకుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాలో పురు రాజవంశపు రాణి కావ్య నాయకి శకుంతల దేవి పాత్రలో సమంత కనిపించనుంది. సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement