Friday, May 3, 2024

సర్కారు వారి అప్డేట్ ఇదే ?

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ నెలాఖరులో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఓ ట్రీట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ట్రీట్ ఏంటి అనే దానిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఆ ట్రీట్ పోస్టర్ తోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది అదేరోజు ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈసారి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారట. ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement