Thursday, May 2, 2024

భారతీయుడు-2…..మరో అప్డేట్

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి కూడా ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. అయితే ఇటీవల శంకర్ కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి రామ్ చరణ్ తో ఉండగా మరొకటి బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ కు సంబంధించిన ప్రకటన చేశాడు.

ఈ నేపథ్యంలోనే భారతీయుడు 2 చిత్ర నిర్మాణ సంస్థ అయిన లైక ప్రొడక్షన్స్ వారు శంకర్ కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ లీగల్ నోటీసులలో సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటూ నిర్మాణ సంస్థ ప్రశ్నించినట్లు సమాచారం. కాగా ఇదే విషయమై శంకర్ తరుపున న్యాయవాది మాట్లాడుతూ… పరిస్థితులు అనుకూలించిన తర్వాత సినిమాను పూర్తిచేస్తామని చెప్పినట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ఇంకా భారతీయుడు సీక్వెల్ ఆగిపోలేదని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement