Friday, April 26, 2024

అధీర ఎంట్రీ పై థీమ్ సాంగ్ !!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించడంతోపాటు… నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం కే జిఎఫ్ పార్ట్ 2 తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీర గావిలన్ రోల్ పోషిస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం అధీర కోసం స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్. విలన్ ను పరిచయం చేస్తూ సాగే ఈ సాంగ్ సినిమాకి హైలెట్ గా నిలవనుందట. హై వోల్టేజ్ తో అద్భుతమైన విజువల్స్ చూపిస్తూ ఈ సాంగ్ ఉండనుందట. అలాగే సంజయ్ దత్ కు రవిశంకర్ డబ్బింగ్ చెప్పబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇక సినిమా మొత్తంలో యశ్ పాత్ర కంటే సంజయ్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని… హైలెట్ అవుతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement