Monday, April 29, 2024

శర్వా30….ఇంకొన్ని గంటలే !!

ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవల శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ మంచి హిట్ ను అందుకున్నాడు. అలాగే ప్రస్తుతం శర్వానంద్ మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. అలాగే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా కూడా చేస్తున్నాడు. మరోవైపు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతూవర్మ హీరోయిన్ గా నటించనుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు శర్వా 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.

కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమా టైటిల్ ఒకే ఒక జీవితం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement