Thursday, March 30, 2023

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న సుజీత్-పవన్ ప్రాజెక్ట్

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట్ర్ సుజీత్. తను చేస్తున్న మూడవ ప్రాజెక్ట్ తోనే తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే సువర్ణావకాశం దక్కించుకున్నాడు. ఈ మూవీ గురించి ఇటీవలే ఎనౌన్స్ చేశారు మేకర్స్, “They call him OG” అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో కూడా సూపర్ గా ట్రెండ్ అయ్యింది.

కాగా, రేపు (సోమవారం) ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక ఇదిలా ఉంటే,
ఈ పవర్ ప్రాజెక్ట్ కు అనిరుధ్‌ని బోర్డులోకి తీసుకురావాలని అభిమానులు తమ కోరికను వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -
   

డివివి ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నటీనటులు, సిబ్బందికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో ఇప్పుడు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ సినిమా కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement