Thursday, April 25, 2024

Under–19 (W) World Cup | ఇంగ్లండ్​ను దెబ్బతీసిన షఫాలీ సేన.. ​అండర్​19 వరల్డ్​ కప్​ మనదే!

భారత క్రికెట్ అభిమానులకు ఇవ్వాల పండగ రోజు. టీమిండియా రెండు మ్యాచ్‌లలో తలపడుతోంది. ఒకటేమో భారత్, న్యూజిలాండ్ మధ్య లక్నో వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది.. ఇక రెండోదేమో.. అమ్మాయిల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఆడుతున్నాయి.  కాగా, ఇప్పటికే భారత్​, ఇంగ్లండ్​ జట్ల మధ్య జరుగుతున్న ఆటలో టాస్​ గెలిచి టీమిండియా అమ్మాయిల జట్టు బౌలింగ్​ ఎంచుకుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొలి ఐసీసీ అండర్​ ‌‌19 వరల్డ్​ కప్​లో టీమిండియా అమ్మాయిలు శభాష్​ అనిపించుకుంటున్నారు. సెమీస్​లో న్యూజీలాండ్​ని చిత్తుచేసిన అమ్మాయిల జట్టు ఇవ్వాల ఇంగ్లండ్​ తో ఫైనల్​లో తలపడుతోంది. కాగా, టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న షఫాలీ సేన.. ఇంగ్లండ్​ బ్యాట్స్ వి​మెన్​ని కోలుకోని దెబ్బతీసి, 17 ఓవర్లలోనే ఆలౌట్​ చేసింది. ఇక.. 68 పరుగులకే ఇంగ్లండ్​ జట్టు టీమిండియా అమ్మాయిల దెబ్బకు కుప్పకూలింది.

ఇక.. సెకండ్​ ఇన్సింగ్స్​లో టీమిండియా కెప్టెన్​ షఫాలి వర్మ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఉన్న అమ్మాయిలు ఇంగ్లండ్​ని చిత్తు చేసి వరల్డ్​ కప్​ సొంతం చేసుకోనున్నారు. కాగా, శనివారం బర్త్ డే జరుపుకున్న టీమిండియా కెప్టెన్ షఫాలీ వర్మ.. తన పుట్టిన రోజు కానుకగా భారత్​కి వరల్డ్ కప్ ట్రోఫీని అందించాలని సహచరులను కోరింది. భారత అమ్మాయిలు ఫైనల్ చేరగానే.. బీసీసీఐ కార్యదర్శి జై షా వారితో మాట్లాడి అభినందనలు తెలిపారు. ఫైనల్‌కు ముందు వారిలో స్ఫూర్తి నింపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement