Thursday, May 2, 2024

మహేష్ రాజమౌళి సినిమా కథ ఇదే ?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తర్వాత సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలు కానుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ గ్యాప్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో చత్రపతి శివాజీ గా మహేష్ కనిపించబోతున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో మాత్రం తెలియరావట్లేదు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement