Saturday, May 4, 2024

మూగ‌బోయిన సంగీత ప్ర‌పంచం.. డిప్రెష‌న్ తో హాంకాంగ్ సింగర్ కోకో లీ ఆత్మహత్య

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్, పాటల రచయిత, నటి కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 48 ఏళ్లు కాగా.. ఈ విషయాన్ని లీ సిస్ట‌ర్స్‌ కరోల్, నాన్సీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొంతకాలంగా డ్రిప్రెషన్ లో ఉన్నలీ పరిస్థితి రీసెంట్ గా మరింత దిగజారినట్టు వారు పేర్కొన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయట పడేందుకు ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల 2న లీ ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించడంతో.. అపస్మారకస్థితిలో ఆమెను గుర్తించిన ఫ్యామిలీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే కోమాలోకి చేరుకుంది. దాదాపు మూడు రోజులు కోమాలో చావుతో పోరాటం చేసిన లీ.. చివరికి తుదిశ్వాస విడిచిన‌ట్టు వారు వెల్ల‌డించారు.

- Advertisement -

ఈ విషయం తెలిసిన హాంకాంగ్ సంగీత ప్రియులు తట్టుకోలేకపోతున్నారు. ఆమె మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది. మౌన గానంతో ఆమెకు నివాళి అర్పిస్తోంది. హాంకాంగ్‌లో జన్మించిన లీ శాన్‌ఫ్రాన్సిస్కోలో పెరిగింది. ఆ తర్వాత పాప్ సింగర్‌గా కెరియర్‌ను ప్రారంభించింది. తన 30 ఏళ్ల కెరియర్‌లో పాప్ సింగర్ గా వందల ఆల్బమ్స్‌ రిలీజ్ చేసింది.

1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఘనత అందుకున్న తొలి చైనీస్ అమెరికన్‌గా రికార్డుకెక్కింది. 1998లో ఆమె విడుదల చేసిన మాండరిన్ ఆల్బం డి డా డి సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ సాంగ్ దాదాపు మూడు నెలల్లోనే 10 లక్షలకు పైగా కాపీలు అమ్ముడు పోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement