Friday, April 26, 2024

కష్టాల్లో సీనియర్ నటుడు…సహాయం చేయండి !!

పొన్నంబళం…ఈ పేరు సినీ ప్రేక్షకులకు కొద్దిమందికే తెలుసు. కానీ ఆయన ఫేస్ చూస్తే మాత్రం ఈయన చాలా సినిమాల్లో నటించారు అని చెప్పేస్తాం. విలన్ గా తెలుగు, తమిళ సినిమాలలో నటించిన పొన్నంబళం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో వైద్యం ఖర్చు కోసం అందరినీ డబ్బులు అడుగుతున్నాడు. గత కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైన పొన్నంబళం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు కిడ్నీ మార్పిడి చికిత్స జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా గా తనకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా అందరిని వేడుకుంటున్నాడు.

తన సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని.. కానీ ప్రస్తుతం ఆదాయం లేక తమ కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. చికిత్స కు డబ్బు ఖర్చు అవుతుందని,ఇప్పటికే నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధనుష్, కె.ఎస్.రవికుమార్, రాఘవ లారెన్స్, తనకు ఆర్థిక సహాయం చేశారని.. ఇంకా చాలా డబ్బు అవసరం ఉందని దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement