Monday, April 29, 2024

టక్ జగదీష్ ‘ఇంకోసారి ఇంకోసారి’ రికార్డు

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, నాజర్,నరేష్, రావు రమేష్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి సినిమా ఘన విజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి విడుదల అయిన లుక్స్ కు, సాంగ్స్ కు ప్రేక్షకుల విశేష స్పందన రాగా అందులో ఇంకోసారి ఇంకోసారి అనే మెలోడీ సాంగ్ కు మాత్రం కాస్త ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

తాజాగా ఈ లిరికల్ వీడియో సాంగ్ 5 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. శ్రేయ ఘోషల్, కాల భైరవ ఆలపించిన ఈ సాంగ్ కు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. కాగా ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే విడుదల తేదీని మాత్రం త్వరలోనే ప్రకటించనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement