Saturday, April 27, 2024

రూమర్స్ నమ్మకండి – వకీల్ ఓటీటీకి రాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో బిగ్ స్క్రీన్ పై కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ చిత్రం అదే స్థాయిలో కలెక్షన్లను కూడా సాధిస్తోంది. అలాగే లాయర్ సత్యదేవ్ గా పవన్ కళ్యాణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరోవైపు నివేద థామస్, అంజలి, అనన్య ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది మరేదో కాదు వకీల్ సాబ్ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతుందని ప్రచారం జరిగింది. కాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూమర్స్ ని నమ్మకండి. వకీల్ సాబ్ సినిమాని ఓన్లీ బిగ్ స్క్రీన్ పై మాత్రమే చూడండి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చెయ్యట్లేదు అంటూ ఓ పోస్టర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఇక దీంతో వకీల్ సాబ్ ఓటిటిలో రిలీజ్ కాబోతుందన్న వార్తకు బ్రేక్ పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement