Thursday, April 25, 2024

బిగ్ అనౌన్స్ మెంట్ – ఈసారి రిపేర్లు బౌండరీలు దాటుతాయి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ లిస్ట్ లో ముఖ్యంగా త్రివిక్రమ్, కొరటాల శివ పేర్లు వినిపించగా… ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.

ఎన్టీఆర్ తన 30 వ సినిమాని కొరటాల శివ తో చేయబోతున్నాడు. ఈ మేరకు కొరటాల శివ ఓ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ 30 వ సినిమాను తాను డైరెక్ట్ చేస్తున్నానని… ఈ సినిమా ఏప్రిల్ 29 2022న రిలీజ్ కాబోతుందని ప్రకటించాడు. ఈ ప్రాజెక్టును చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని గతంలో రిపేర్లు లోకల్ లో జరిగాయని ఈసారి బౌండరీలు దాటుతున్నామని ట్వీట్ చేశాడు. ఇక గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి విజయం సాధించిందో కొత్తగా చెప్పనవసరం లేదు.

https://twitter.com/sivakoratala/status/1381601065116651522?s=19

Advertisement

తాజా వార్తలు

Advertisement