Friday, April 26, 2024

శ్రీవిష్ణు…గంగవ్వ చోర గాథ ఇదే !!

హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజరాజ చోర. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ తాజాగా చోర గాథ బై గంగవ్వ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. నీకు ఊ కొట్టే కథ తెలుసా… ఏది చెప్పినా ఊ కొట్టాలి అని అసలు.. కథ మొదలు పెడుతుంది గంగవ్వ. అనగనగా ఓ సూర్యుడు ఉండేటోడు. ఆ సూర్యుడు భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి బంగారం వచ్చాయి… అంటూ గంగవ్వ చెబుతూ స్టార్ట్ చేస్తుంది. ఇక రాజు, దొంగ ,కిరీటం ఈ మూడింటి మధ్య ఏం జరిగింది.. రాజు కిరీటాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు దొరుకుతార లేదా అనే ప్రశ్న తో ఈ సినిమా సాగనుంది.

ఇక ఈ సినిమా టీజర్ జూన్ 18న విడుదల కానుంది. ఇక తనికెళ్ల భరణి ,రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement