Saturday, June 12, 2021

టెన్త్‌, ఇంటర్ పరీక్షలు ర‌ద్దు చేయాలి: సీఎం జగన్ కి నారా లోకేష్ లేఖ

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. లేఖతోపాటు విద్యార్థుల అభిప్రాయాలను కూడా పంపించారు. ఇప్పటికే 15 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని లేఖలో పేర్కొన్నారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చేశాయని, ఏపీలో కూడా ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. ఏపీలో పిల్లలను పరీక్షలకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని చెప్పారు. ప్రభుత్వం మొండి పట్టు పట్టడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమేనన్నారు. ఫ్రీ ఫైనల్‌, ఇంటర్నల్‌ పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వొచ్చని లోకేష్‌ లేఖలో తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షల రద్దుపై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రిని కోరుతున్నాను. లేఖతో పాటు పరీక్షలు రద్దు చెయ్యాలంటూ విద్యార్థులు తెలిపిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేఖతో పాటు పంపారు నారా లోకేష్.

Advertisement

తాజా వార్తలు

Prabha News