Sunday, June 20, 2021

కరీంనగర్: వైద్యుల నిర్లక్ష్యంతో ముక్కులో విరిగిన స్వాబ్

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్ రావు పల్లె గ్రామంలో కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అయిన జవ్వాజి శేఖర్‌కు వైద్యులు కరోనా టెస్ట్ చేస్తుండగా ముక్కులో స్వాబ్ (పుల్ల) ద్వారా శాంపిల్ తీసుకుంటున్న సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో స్వాబ్ ముక్కులో విరిగింది. భయాందోళనకు గురైన సర్పంచ్ జవ్వాజి శేఖర్ హుటాహుటిన కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా వైద్యులు ముక్కులోని స్వాబ్ తొలగించారు. దీంతో సర్పంచ్ ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యులు నిర్లక్ష్యం వ్యవహరించకూడదని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News