Sunday, May 5, 2024

తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి తండ్రి మృతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి గురించి పరిచయం చేయనవసరం లేదు. అయితే కీర్తి రెడ్డి తండ్రి టిఆర్ఎస్ నాయకుడు గడ్డం ఆనంద్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆనంద్ రెడ్డి వయస్సు 60 సంవత్సరాలు. గుండెపోటు రావడం తో ఆనంద్ రెడ్డిని హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారు.

2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గా బిజెపి తరఫున పోటీ చేసి ఓటమి చెందారు ఆనంద్ రెడ్డి. ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. ఇక ఆనంద్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు కాగా… అందులో ఒకరు కీర్తి రెడ్డి. కీర్తి రెడ్డి 2004లో హీరో సుమంత్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2006లో విడాకులు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement