Thursday, April 25, 2024

సల్మాన్ సినిమాల్లో రెండో చెత్త సినిమాగా ‘రాధే’

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే’ రంజాన్ కానుకగా గురువారం నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కరోనా పరిస్థితుల ప్రభావంతో థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. సల్మాన్ క్రేజ్ వల్ల ఓ దశలో జీ5 యాప్ సర్వర్ కూడా క్రష్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఐఎండీబీ ఈ సినిమా 10కి 2.1 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ సినిమాల్లో ఐఎండీబీ చెత్త రేటింగ్ ఇచ్చిన సినిమాల్లో ‘రాధే’ రెండో స్థానంలో నిలిచింది. గతంలో ‘రేస్-3’ సినిమాకు 1.9 రేటింగ్ మాత్రమే వచ్చింది. సావన్ సినిమా 2.2 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంది.

మరోవైపు ఈ సినిమాకు నిరసన సెగలు కూడా తగులుతున్నాయి. సోషల్ మీడియాలో సల్మాన్ ‘రాధే’ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ‘బాయ్ కాట్ రాధే’ అనే ట్యాగ్‌తో జాతీయ స్థాయిలో ట్రెండ్ చేస్తుండ‌గా, దీనికి గ‌ల పూర్తి కార‌ణం తెలియాల్సి ఉంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ముంబై క్రైమ్ నేపథ్యంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement