Sunday, April 28, 2024

కాంప్రమైజ్ అయిన సారంగదరియా …వివాదానికి చెక్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. కాగా ఈ సినిమాకు సంబంధించిన సారంగదరియా పాట పై వివాదం నడిచిన సంగతి కూడా తెలిసిందే. కోమలి అనే జానపద గాయని తన పాటకు సుద్దాల అశోక్ తేజ క్రెడిట్ తీసుకుంటున్నారని మీడియా ముందుకు వచ్చింది. టీవీ ఛానల్ లో సైతం తన పాటని తనతో పాడించాలని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా తాజాగా ఈ పాటకు సంబంధించి వివాదం సమసిపోయిందని తమ మధ్య ఎంతమాత్రం భేదాభిప్రాయాలు లేవని దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ప్రకటన విడుదల చేశారు.

సారంగదరియా పాటను లవ్ స్టోరీ సినిమాలో ఉపయోగించుకోవడం పట్ల తాను చేయబోయే తరువాత సినిమాలలో కోమలికి పాట పాడే ఛాన్స్ ఇస్తానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారు. అంతేకాకుండా లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ లో సారంగదరియా పాట కోమలి తో పాటిస్తానని శేఖర్ కమ్ముల చెప్పారట. ఇక ఇంతటితో ఈ వివాదం ఆగిపోయినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement