Friday, May 10, 2024

మీరు మారిపోయారు సార్…కొత్తగా నిరుద్యోగ భృతి ఏంటి సార్ !!

నిరుద్యోగ భృతి పై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం సాగు చట్టాల అమలు పై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా… తెలంగాణలో వ్యవసాయ మార్కెట్లను యధావిధిగా కొనసాగిస్తామని, ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి పై రెండు మూడు రోజుల్లోనే అసెంబ్లీ సమాచారం సమావేశాల వేదిక వారందరినీ సంతోషపరిచే ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా నిరుద్యోగ భృతి అనే మాట కూడా నచ్చని కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. కరోనా టైంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వమని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు సాగర్ ఎన్నికల పుణ్యమాని నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ మాటలు విన్న వారు ఇదంతా సాగర్ ఉప ఎన్నికల పుణ్యమేనని అంతే తప్ప మరొకటి కాదని మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement