Wednesday, May 1, 2024

బాబాయ్ రికార్డులను బద్దలు కొట్టిన అబ్బాయి.. రీ-రిలీజ్‌లో “ఆరెంజ్” రికార్డ్ కలెక్షన్స్

స్టార్ హీరోల బర్త్ డేల సందర్భంగా వారి హిట్ సినిమాలని 4K ఫార్మాట్ లో రీ-రిలీజ్ చేయడం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ గా మారింది. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ప్రిన్స్ మహేష్ బాబు పోకిరి సినిమాతో స్టార్ట్ అయి కొత్త రికార్డులు సెట్ చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజున జల్సా రీ-రిలీజ్‌ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఆ త‌రువాత‌ వచ్చిన ఏ రీ-రిలీజ్ కూడా జల్సా రికార్డును బ్రేక్ చేయలేక‌పోయింది.

ఇక అలానే రీసెంట్ గా బర్త్‌డే స్పెషల్‌గా రీ-రిలీజ్ అయిన కల్ట్ క్లాసిక్ సినిమా రామ్ చరణ్ ఆరెంజ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ రీ-రిలీజ్ అయింది. ఇది 3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి జల్సా రికార్డును బద్దలు కొట్టింది. అంతే కాకుండా ఇప్ప‌టికీ ఈ సినిమా కొన్ని థ‌యేట‌ర్ల‌లో ర‌న్ అవుతుంది. ఈ మూవీ గరిష్ట ఏరియాల్లో భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. చాలా షోలు హౌస్ ఫుల్‌గా మారాయి. ఈ రీ-రిలీజ్‌ని మూవీ టీమ్ చాలా బాగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది. మొదట, వారు పరిమిత షోల‌కి స్క్రీనింగ్‌ను ప్రారంభించారు. అయితే, రీ-రిలీజ్ కి పెరిగిన డిమాండ్‌తో.. ప్రదర్శనల సంఖ్యను పెంచారు మేక‌ర్స్.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2010లో విడుదలై భారీ బాక్సాఫీస్ ఫ్లాప్ గా నిలిచింది. కానీ, ఆ తర్వాతి సంవత్సరాలలో, ఈ మూవీ కల్ట్ ఫాలోయింగ్‌ను పొందింది. సోషల్ మీడియా ఈ మూవీ గురించి చర్చిస్తూనే ఉన్నారు. ఆరెంజ్‌ రీ-రిలీజ్‌ నుంచి వచ్చిన కలెక్షన్లను జనసేన పార్టీకి విరాళంగా అందజేయనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement