Sunday, April 28, 2024

తేజ సజ్జ ‘ఇష్క్’ ట్రైలర్

‘జాంబీరెడ్డి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ స‌జ్జ తాజాగా మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అతడు నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇష్క్’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ మూవీ ట్రైల‌ర్‌ను గురువారం ఉద‌యం 10:36 గంట‌ల‌కు హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశాడు. ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ థ్రిల్లర్ మూవీకి ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల త‌రువాత మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement