Thursday, March 28, 2024

వకీల్ సాబ్ లో శృతి హాసన్ పాత్ర అవసరం – వేణు శ్రీరామ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో రాబెడుతోంది. అయితే సినిమా సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదని కావాలనే ఓ పాత్రను పెట్టారని కామెంట్లు వస్తున్నాయి.

సినిమాలో బోర్ కొట్టే అంశం ఏదైనా ఉందంటే శృతి హాసన్ పాత్రని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కానీ శృతిహాసన్ పాత్రను కావాలని కల్పించలేదు. అనవసరంగా పెట్టలేదు. సత్య దేవ్ పాత్ర వెనుక కథ ఏంటనేది అందరికీ తెలియాలి. సత్యదేవ్ తన జీవితంలో కోల్పోయింది ఏంటనేది తెలియాలి. శృతి హాసన్ పరంగా ఆయన జీవితంలో ఒక విషాదం జరిగింది. అందువల్ల అది తెరపై చూపించాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు వేణు శ్రీరామ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement