Monday, April 29, 2024

క్రైమ్, కామెడీ జోనర్ మూవీతో వస్తున్న తరుణ్ భాస్కర్..

‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇటీవల విడుదలైన ఈ నగరానికి ఏమైంది చిత్రానికి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. రెండు హిట్లు కొట్టిన తరుణ్ మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తన మూడో ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. క్రైమ్ కామెడీ జానర్‌లో ఈ సినిమా ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ ‘కీడా కోల’. ‘కిడా’ అంటే బొద్దింక.. కోలా ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్. ’’ మునుపెన్నడూ లేని విధంగా క్రైమ్ కామెడీని ఆస్వాదించండి’’ అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు.

భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement