Saturday, April 27, 2024

తమిళ తలైవి @ యు సర్టిఫికెట్

జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక టీజర్ విడుదలైనప్పటి నుంచి కూడా సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని సినీ అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇక ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ సింగ్ నిర్మించారు. ఇక తాజాగా తమిళంలో ఈ సినిమాకు యు సర్టిఫికేట్ ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. అతి త్వరలోనే తెలుగు హిందీ వెర్షన్ కు సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement