Monday, April 29, 2024

Yatra-2:యాత్ర 2లో సోనియా గాంధీగా సుజానే బెర్ర్నెర్ట్

ఎన్నికల వస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్య మూవీ ‘యాత్ర-2 . ఒకటి. మహి.వి.రాఘవ దర్శకత్వం వహించిన ‘యాత్ర’ చిత్రానికి ఇది కొనసాగింపు. తొలి భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘యాత్ర -2’లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ పేరు బలంగా వినిపించింది. అందుకే ‘యాత్ర 2’లో ఆమె పాత్రను జోడించారు. ఆ పాత్రకు జర్మన్‌ నటి సుజానే బెర్నెర్ట్‌ని ఎంపిక చేశారు. ఇప్పటికే ఆమెపై కొంత షూటింగ్‌ కూడా జరిగింది. మంగళవారం ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘మీరు అతన్ని ఓడించలేకపోతే.. అతన్ని నాశనం చేయండి’ అనే ట్యాగ్‌లైనను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement