Monday, May 6, 2024

Jagityala – గంజి కూడా పోయని కొడుకు… బుద్ది చెప్పేందుకు నామినేష‌న్ వేసిన 82 ఏళ్ల మాతృమూర్తి

జ‌గిత్యాల . చాలా మంది తల్లిదండ్రులు తాము కష్టపడినా పిల్లలు సుఖంగా ఉండాలని భావిస్తారు. వారి కోసం కష్టపడతారు. కానీ ఆ పిల్లలే పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోరు. కనీసం అన్నం కూడా పెట్టారు. ఇలా తల్లిదండ్రులకు కొడుకులు గంజిపోయకపోతే పెద్దలకు ఫిర్యాదు చేస్తారు. అయినా కొడుకులు వినకుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అయినా వినకుంటే కోర్టుకు పోతారు. కానీ ఓ వృద్దురాలు తన కొడుకు తనకు గంజి పోయడం లేదని వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలు, ప్రభుత్వ అధికారుల దృష్టిని ఆకర్షించాలని ఏకంగా ఎమ్మెల్యేకు నామినేషన్ వేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కుమారుడు సరిగా పోషించడం లేదని వృద్ధాప్యంలో ఉన్న తనపై కేసులు పెట్టి వేధిస్తున్నాడని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కూరిక్యాలకు చెందిన చీటి శ్యామలకు పెద్ద కొడుకు నుంచి వేధింపులు పెరిగాయి. ఇల్లు స్వాధీనం చేసుకున్న అతను కేసులు పెట్టి తల్లిని కోర్టులు చూట్టు తిప్పుతున్నాడని చెబుతున్నారు.

దీంతో 82 ఏళ్ల శ్యామల తన సమస్యను సమాజం, మీడియా దృష్టికి తీసుకెళ్లాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. తన బంధువులతో కలిసి జగిత్యాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నామినేషన్ వేశారు. ముసలితనంలో ఆరోగ్యం బాగోలేక బాధపడుతున్న తనకు..తన కొడుకు ఆస్పత్రిలో కూడా చూపించడం లేదని వాపోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్యాయం జరగాలని నామినేషన్ వేస్తున్నానని శ్యామల చెప్పారు. శ్యామల నామినేషన్ వేయడంతో ఆ సమస్య మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పటికైనా ఆమె కొడుకు స్పందిస్తాడో లేదో చూడాలి మరి. కానీ ఈ వయస్సులో శ్యామల చేసిన ప్రయత్నానికి అందరు అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement