Monday, April 29, 2024

నిజ జీవిత ఘటనల ఆధారంగా సూర్య కొత్త సినిమా !!

గతేడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఈ సినిమా తమిళ్ లో సూరరై పోట్రు పేరుతో తెరకెక్కింది. అయితే అదే జోష్ తో సూర్య వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. అందులో పాండిరాజ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య మహిళలకు అండగా నిలిచే ఓ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా..సత్య రాజ్, శరణ్య పోనవన్నన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇది కాకుండా సూర్య మరో మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement