Monday, May 6, 2024

ఉత్త‌మ న‌టుడిగా సూర్య‌.. రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీదుగా అవార్డుల ప్ర‌దానం..

కేంద్ర ప్ర‌భుత్వం 2020 ఏడాదికిగాను జాతీయ అవార్డుల (68th National Film Awards)ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఇవ్వాల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా సూర్య న‌టించిన సూరారై పోట్రు (Soorarai Pottru) ఎంపికైంది. ఈ సినిమాకు జాతీయ ఉత్త‌మ న‌టుడుగా సూర్య, జాతీయ ఉత్త‌మ న‌టిగా అప‌ర్ణ బాల‌ముర‌ళి ఉత్త‌మ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌-జీవీ ప్ర‌కాశ్ కుమార్ ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా సూర్యతోపాటు జీవీ ప్ర‌కాశ్‌కుమార్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి, డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర అవార్డుల‌ను అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement